కన్న కొడుకును చంపించిన తల్లిదండ్రులు

కన్న కొడుకును చంపించిన తల్లిదండ్రులు

మందు తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకుని కడతేర్చిన సంఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు వివరాలు.. జవహర్​ నగర్, వంపుగూడలో ఉండే పెరుపల్లి శ్రీనివాస్(45), భార్య మణెమ్మ కాప్రా మున్సిపాలిటీలో స్వీపర్లు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతరు. పెద్ద కొడుకు సాయి కుమార్​(25) పేయింటర్. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తల్లిదండ్రులను వేధించసాగాడు. గతనెల 25న శ్రీనివాస్, మణెమ్మల పెండ్లి రోజు కావడంతో కూతరు లావణ్య పుట్టింటికి వచ్చి మరుసటి రోజు వెళ్లిపోయింది.

26 మధ్యాహ్నం సాయి మద్యం మత్తులో తల్లిని కొట్టాడు. రోజు రోజుకు సాయి ఆగడాలు పెరిగిపోవడంతో తల్లిదండ్రులు అతన్ని హతమారుద్దామని నిర్ణయించుకున్నారు. డ్రైవర్​గా పనిచేసే సాయి సోదరుడు సందీప్ తల్లిదండ్రులు అనుకునే మాటలు విన్నాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సందీప్​తన స్నేహితులు ఫయాజ్, ఇబ్రహీంలతో కలిసి ఇంటికి వచ్చాడు. సాయిని చంపేస్తే ఎంత డబ్బయినా ఇస్తామని శ్రీనివాస్, మణెమ్మలు​చెప్పారు. దీంతో సందీప్​అతని స్నేహితులు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సాయి కుమార్​ను వంపుగూడ, బ్యాంక్​కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు బాటిల్​తో తలపై కొట్టి బండరాళ్లతో చంపేశారు.

ఈనెల 3న తన కొడుకు గత నెల 26 నుంచి తాగిన మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి శ్రీనివాస్​ జవహర్​ నగర్​ పోలీసులకు కంప్లెయింట్​చేశాడు. హత్య చేసినప్పటి నుంచి తీవ్ర భయానికి గురువుతన్నాడు సందీప్. అలాగే తీవ్ర భయాందోళనకు గురైన అతని స్నేహితుడు గిద్దె సందీప్​ ఈనెల 11న స్థానిక లీడర్​కి హత్య చేసిన విషయం తెలిపాడు.  అతను సంఘటన స్థలానికి వెళ్లి హత్య నిజమేనని తెలుసుకుని జవహర్ నగర్​ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలంలో దొరికిన పుర్రెను పరీక్ష నిమిత్తం గాంధీ హాస్పటల్​కి తరలించారు. పరిశీలించిన గాంధీ డాక్టర్లు ఈ పుర్రె 25 సంవత్సరాల వయసు ఉండే యువకుడిది అని చెప్పారు. అది చనిపోయిన సాయిదేనా అనే విషయం తెలుసుకోడానికి డీఎన్​ఏ టెస్టు చేయించడానికి ఎఫ్​ఎస్​ఎల్​కు పంపారు. వారు నిర్ధరించడంతో నిందితులైన సోదరుడు పెరుపల్లి సందీప్​, స్నేహితులైన షేక్​ ఫయాజ్, గిద్యాల సందీప్​ కుమార్​, తండ్రి పెరుపల్లి శ్రీనివాస్​, తల్లి మణెమ్మలను రిమాండ్​కు తరలించగా, హత్య భాగస్వాముడైన మరో నిందితుడు ఇబ్రహీం కోసం గాలిస్తున్నామని తెలిపారు సీఐ.