పరిషత్ పోరు : మొదటి విడతకు ముగిసిన నామినేషన్లు

పరిషత్ పోరు : మొదటి విడతకు ముగిసిన నామినేషన్లు

రాష్ట్రంలో మొదటి విడత పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతలో 197 ZPTC స్థానాలకు, 2 వేల 166 MPTC స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను, ప్రతీ మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. నామినేషన్ల పర్వం ముగియడంతో గురువారం నామినేషన్ల పరిశీలన, బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఈ నెల 26 న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27 న వాటిని పరిశీలించి… 28 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఆఖరిరోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా అంతటా ఎంపీడీఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారులకు టిఆర్ ఎస్ , కాంగ్రెస్ ,వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని mpdo ఆఫీస్ ల్లో నామినేషన్లు వేశారు అభ్యర్థులు. నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలతో పాటు మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్లు సమర్పించారు పోటీదారులు.

ఇప్పటికే మండల కేంద్రాలు, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు .. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల తరపున బీ ఫారాలు ఇచ్చిన వారితో పాటు స్వతంత్రులకు పార్టీ సింబల్స్ ఇస్తారు. తొలివిడతలో మే 6 న ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా..శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్లు ప్రారంభం అవుతాయి.