కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్లో తెలుగులోనే కడిగిపారేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

కేంద్రం చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్లో తెలుగులోనే కడిగిపారేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఢిల్లీ: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోక్ సభలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్టీపీసీ ఉందని, RFCL ఉందని, సింగరేణి ఉందని.. మొత్తంగా రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వానికి తాము అందిస్తున్నామని.. కానీ కేంద్రం నుంచి వంద కోట్లు, రూ.150 కోట్లకు మించి తమకు తిరిగి రావడం లేదని చెప్పారు.

అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని కేంద్రాన్ని పలుమార్లు అభ్యర్థించామని, మైనింగ్ యూనివర్సిటీ కావాలని అడిగామని, సింగరేణి కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని కేంద్రాన్ని కోరామని పెద్దపల్లి ఎంపీ గుర్తుచేశారు. వీటిల్లో ఏ ఒక్కటీ కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తమను శిక్షిస్తుందని ఎంపీ వంశీకృష్ణ సభ దృష్టికి తీసుకొచ్చారు.

పెద్దపల్లిలో వెయ్యి కోట్లతో సెమీ కండక్టర్ ఫెసిలిటీ పెడితే ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. కానీ.. లాస్ట్ మినిట్ లో అన్యాయంగా సెమీ కండక్టర్ ఫెసిలిటీని తమకు కేటాయించకుండా ఆంధ్రాకు తీసుకుపోయారని ఆయన తెలిపారు. ఈ అన్యాయంపై పోరాడుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సభలో స్పష్టం చేశారు. 

ALSO READ : రైల్వే ప్రయాణికులకు షాక్

ధర్మపురిలో కోటి లింగాల ఉందని, మంథనిలో రామగిరి కోట ఉందని, పెద్దపల్లిలో బుద్ధ స్థలం ఉందని.. వీటి అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆయన కేంద్రం తీరుపై మండిపడ్డారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని తీరు ఉందని ఆయన విమర్శించారు.