రైల్వే ప్రయాణికులకు షాక్ : 8 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇవ్వరు..!

రైల్వే ప్రయాణికులకు షాక్ : 8 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇవ్వరు..!

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ ఇది. రైల్వే టికెట్ల రద్దు.. అదేనండీ క్యాన్సిల్ చేసుకునే విషయంపై కీలకమైన అప్ డేట్ ఇచ్చింది రైల్వే శాఖ. బుక్ చేసుకున్న రైల్వే టికెట్ క్యాన్సిల్ చేసుకునే రూల్స్ మార్చింది. ఆ కీలకమైన అప్ డేట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టికెట్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రైల్వే శాఖ. రైలు వెళ్లే 8 గంటల ముందు టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ రాదని నిబంధనల్లో పేర్కొంది. 8 తర్వాత నుంచి 24 గంటల లోపు క్యాన్సిల్  చేస్తే రీఫండ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.  

టికెట్ క్యాన్సిలేషన్ కొత్త నిబంధనలు:

  • రైలు బయలుదేరడానికి 72 గంటలకు ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే – కేవలం కనీస క్యాన్సిలేషన్ ఫీజు మాత్రమే తీసుకుని, గరిష్ట రీఫండ్ ఇస్తారు.  
  • 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే – ఛార్జీలో 25 శాతం కట్ చేసి 75 శాతం రీఫండ్ ఇస్తారు.  
  • 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే – 50 శాతం ఛార్జీ కట్ చేసి రీఫండ్ ఇస్తారు.  
  • రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు రద్దు చేస్తే – ఎలాంటి రీఫండ్ ఉండదు. 

ఇంతకు ముందు 72 గంటల వరకు పూర్తి రీఫండ్ లభించేది. ఇప్పుడు ఆ సౌకర్యం తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం మరికొన్ని ప్రయోజనాలను ప్రయాణికులకు కల్పించారు. ఆఫ్‌లైన్ టికెట్లు ఎక్కడి నుంచైనా రద్దు చేయవచ్చు. టికెట్ ఏ స్టేషన్‌లో బుక్ చేసినా, ఇతర స్టేషన్లలో రద్దు చేసుకునే సదుపాయం కల్పించారు. అదే విధంగా టికెట్‌పై ఉన్న బోర్డింగ్ స్టేషన్ తర్వాత ఏ స్టేషన్ నుంచైనా రైలు ఎక్కవచ్చు. మొబైల్ యాప్‌లో సులభంగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.

30 నిమిషాల ముందు వరకు కోచ్ అప్‌గ్రేడ్:

రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు కోచ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 3rd ACలో ఉంటే, సీట్లు ఖాళీగా ఉంటే 2nd AC లేదా 1st ACకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇదంతా రైల్వేస్ అధికారిక మొబైల్ యాప్ లో అప్ గ్రేడ్ చేసుకును సదుపాయం కల్పించారు. 

టికెట్ బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడం లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించినా, దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తాయని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు.