పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్టమెంటులోప్రవేశపెట్టనున్నారు. అయితే తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఫిబ్రవరి1 ఆదివారం కావడం..అదే రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు..ఈసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడతారా అనే సందేహాలు తలెత్తుతున్న క్రమంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతేడాది బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 1 న అంటే సెలవు దినం శనివారం ప్రవేశపెట్టారు. అంతకుముందుకు మూడు సార్లు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను శని, ఆదివారాల్లో పార్లమెంటు ముందుంచారు.ఈసారి కూడా బడ్జెట్ ను హాలిడే ఆదివారం ప్రవేశపెట్ట వచ్చు అని సంకేతాలు వస్తున్న క్రమంలో బడ్జెట్ సమర్పణపై పెద్ద చర్చ జరుగుతోంది.
ఈసారి ఫిబ్రవరి1 ఆదివారం కావడం..అదే రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు..ఈసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడతారా అనే సందేహాలు తలెత్తుతున్న క్రమంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతేడాది బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 1 న అంటే సెలవు దినం శనివారం ప్రవేశపెట్టారు. ఈసారి కూడా బడ్జెట్ ను హాలిడే ఆదివారం ప్రవేశపెట్ట వచ్చు అని సంకేతాలు వస్తున్న క్రమంలో బడ్జెట్ సమర్పణపై పెద్ద చర్చ జరుగుతోంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ మొదటిసారి అధికారం చేపట్టినుంచి ఫిబ్రవరి1 న బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితిగా మారింది. మొదటి సారి 2017లో బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు. అప్పటినుంచి అదే తంతు కొనసాగుతోంది. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే నిధులు కేటాయింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అందుకే ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ పార్లమెంటులో బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
