
రానున్న లోక్ సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మధ్యే జరుగుతున్నాయని, ఇందులో మరో పార్టీ ప్రమేయమే లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ కు చోటులేదని ఎన్‌డీఏ, యూపీఏ మధ్యే పోరు జరుగుతుం దని తేల్చి చెప్పారు. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన రా హుల్ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటోందని అన్నారు. 13 మంది లోక్ సభ ఎంపీలున్నా విభజన హామీలు సాధించడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు 16 మంది ఎంపీలను ఇస్తే ఏదో చేస్తామని అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. తప్పుడు మాటలతో మభ్య పెట్టాలని చూస్తున్న టీఆర్‌ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి తీరుతారన్నారు.
మోడీ ఓ టెర్రరిస్ట్: విజయశాంతి
ప్రధాని మోడీ.. ప్రజలను భయపెట్టే టెర్రరిస్ట్ అని కాం గ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి విమర్శించారు. ప్రజలను ఖూనీ చేయాలని మోడీ చూస్తుంటే, బాగు చేయాలని రాహుల్ తపన పడుతున్నారని తెలిపారు.
మోడీని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వద్దంటున్నా కేసీఆర్ మాత్రం ఆయనే ప్రధాని కావాలని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి టీఆర్‌ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.