పేదల బాగు కోరే బడ్జెట్‌‌నే కేంద్రం తీసుకొచ్చింది

పేదల బాగు కోరే బడ్జెట్‌‌నే కేంద్రం తీసుకొచ్చింది

న్యూఢిల్లీ: కరోనా వల్ల భారత్‌‌తోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బడ్జెట్‌‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా నిర్మల పైవ్యాఖ్యలు చేశారు. ఎకానమీ త్వరగా కోలుకోవడానికి మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని వివరించారు.

దేశంలోని 130 కోట్ల మంది కోరికలను ప్రతిఫలించేలా ఆత్మనిర్భర్ భారత్‌‌ను రూపొందిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌‌ను వాస్తవికతతో ఉండేలా తయారు చేశామని, ఇది నిజాయితీ కలిగిన బడ్జెట్ అని బీజేపీ ఎంపీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అశ్వినీ మాట్లాడుతూ.. పేదల బాగు కోసం పీఎం కిసాన్ యోజన లాంటి పథకాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని తెలిపారు.