పార్లమెంట్ సమావేశాలు బుధవారం వరకే?

పార్లమెంట్ సమావేశాలు బుధవారం వరకే?

కరోనా ఎఫెక్ట్​తో ముందే ముగింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్​ కంటే ముందే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడటంతో వచ్చే బుధవారంతో సమావేశాలను ముగించాలని కేంద్రం భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు శనివారం జరిగిన లోక్​సభ బిజినెస్​ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్​లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో పార్టీలు సమావేశాలను షెడ్యూల్​కంటే ముందే ముగించాలన్నట్టు తెలిసింది. పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ దీనిపై ఫైనల్​ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.సమావేశాలు మొదలైన తర్వాత ఇప్పటి వరకూ 30 మంది ఎంపీలు, 50 మంది పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ వచ్చింది.