ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. పార్లమెంట్ సమావేశాలకు అఖిలపక్షాల సూచనలు

ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. పార్లమెంట్ సమావేశాలకు అఖిలపక్షాల సూచనలు

పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ నీట్ పేపర్ లీక్ అంశం ప్రస్తావించారు. విపక్షాలకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రా మార్గంలో దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి చేసిన అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ ఖండిచారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, పేపర్ లీక్‌లు, చైనాతో భద్రతాంశాలు, పార్లమెంటులో విగ్రహాల తొలగింపు, రైతులు, కార్మికులు, మణిపూర్, రైలు ప్రమాదాలు, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలక్షాల మీటింగ్ లో కోరారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీ ఆదివారం సాయంత్రం ముగిసింది.