రీఫండ్ల విధానాన్ని మార్చండి.. కేంద్రానికి పార్లమెంటు ప్యానెల్ సూచన

రీఫండ్ల విధానాన్ని మార్చండి.. కేంద్రానికి పార్లమెంటు ప్యానెల్ సూచన

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై సమీక్షించిన పార్లమెంటరీ ప్యానెల్, టీడీఎస్ (టీడీఎస్​) రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పన్నులపై కీలక మార్పులను సూచించింది. గడువులోగా ఐటీ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేయని వారికి కూడా టీడీఎస్ రీఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా రూల్స్​ను మార్చాలని సూచించింది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని చిన్న పన్ను చెల్లింపుదారులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని కమిటీ పేర్కొంది. మతపరమైన, స్వచ్ఛంద ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వచ్చే అనామక విరాళాలపై పన్ను మినహాయింపులు రద్దు చేయాలన్న ప్రతిపాదనను కూడా కమిటీ వ్యతిరేకించింది. ఈ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పన్ను మినహాయింపులు కొనసాగించాలని ప్యానెల్​ సిఫార్సు చేసింది.