
రాష్ట్ర అసెంబ్లీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ వైపున ప్రతిపక్షంలో కూర్చున్న కొందరు ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సెషన్ లో అధికారపార్టీ వైపు కూర్చున్నారు. జూన్ లో 12 మంది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీంతో.. సీఎల్పీ టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయింది. స్పీకర్ నోటిఫికేషన్ కూడా అప్పట్లోనే విడుదలైంది. ఈ పరిణామాల తర్వాత తాజాగా అసెంబ్లీలో వారికి సీట్ల కేటాయింపు టీఆర్ఎస్ వైపు జరిగింది.
అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో వచ్చారు.