కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్లను సింగరేణికి కేటాయించే ప్రతిపాదన లేదు..ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్రం ఆన్సర్

కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్లను సింగరేణికి కేటాయించే ప్రతిపాదన లేదు..ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్రం ఆన్సర్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు కోయగూడెం బ్లాక్‌‌‌‌–3, సత్తుపల్లి బ్లాక్‌‌‌‌–3ని సింగరేణి సంస్థ కు కేటాయించే ప్రపోజల్స్ ఏవీ తమ వద్ద లేవ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గతంలో వేలం వేసిన కోయగూడెం, సత్తుపల్లి బ్లాకులు ప్రైవేట్‌‌‌‌ సంస్థలకు కేటాయించినప్ప టికీ.. అక్కడ ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు.

అయితే, ఈ బ్లాకులను తిరిగి సింగరేణికి కేటాయించా లన్న ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో లేదని ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి రాతపూర్వకంగా వెల్లడించారు. అయితే, ఈ కోయగూడెం బ్లాక్‌‌‌‌–3, సత్తుపల్లి బ్లాక్‌‌‌‌–3తో పాటు శ్రావణపల్లి, పీకేఓసీ–2 డిప్‌‌‌‌ సైడ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ తదితర కోల్‌‌‌‌ బ్లాకులను సింగరేణికి కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు.