ఈ ఏడాది కోట్లాది మంది భక్తులతో కిటకిటలాడిన మహాకుంభమేళాలో.. దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన సామాన్య యువతి మోనాలిసా భోంస్లే. కేవలం పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఈ అమ్మాయి... తన అసాధారణ సౌందర్యం, ఆకర్షించే కళ్లతో సోషల్ మీడియా కవరేజ్ తో సెన్సేషన్ గా మారింది. నెటిజన్లు ఆమెకు 'మహా కుంభ్ వైరల్ గర్ల్' అనే బిరుదునిచ్చి, అమాంతం సెలబ్రిటీ హోదా కట్టబెట్టారు. ఆ ఒక్క ఫోటోతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరిగింది.
ఒక్కసారిగా మారిన జీవితం..
కుంభమేళాలో రుద్రాక్ష పూసలు అమ్ముకునే ఈ యువతి స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఆమె సహజమైన అందం, అమాయకత్వం చూసిన సినీ ప్రముఖులు ఆకర్షితులయ్యారు. బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేశారు.రాత్రికి రాత్రి ఆమెను స్టార్ ను చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా (The Diary of West Bengal ఫేమ్) ఆమె ప్రతిభను తొలుత గుర్తించారు. ఈ వైరల్ సెన్సేషన్ కోసం ఆయన ప్రత్యేకంగా ఆమె స్వగ్రామానికి వెళ్లి, తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో ప్రధాన పాత్రను అందించారు. ఈ సినిమా మణిపూర్ నేపథ్యంతో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ .
అంతటితో ఆగకుండా.. మోనాలిసా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె కథానాయికగా నటిస్తున్న 'లైఫ్' మూవీ షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రంలో 'క్రష్', 'ఇట్స్ ఓకే గురు' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సాయి సరసన మోనాలిసా నటిస్తోంది.ఈ సినిమాను శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ మీద అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
కలల ప్రపంచంలో ..
మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఖర్‌గోన్ జిల్లాలోని మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా కుటుంబం ఒక సంచార తెగకు చెందినది. చిన్నప్పటి నుంచి నర్మదా నది తీరాన పూలు, పూసలు అమ్ముతూ ఆమె పెరిగింది. అయితే, ఒక కంటెంట్ క్రియేటర్ తీసిన చిన్న వీడియో ఆమె జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఆకర్షణీయమైన కళ్లు, ముఖంలో ఉన్న స్వచ్ఛత ఇంటర్నెట్‌ను కట్టిపడేశాయి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ముంబైలో నటనపై ప్రత్యేక శిక్షణ తీసుకుని తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. కుంభమేళాలోని సాధారణ అమ్మాయి అయిన మోనాలిసా భోంస్లే ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఉరకలేస్తోంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
నమస్కారం హైదరాబాద్
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2025
- #MonalisaBhosle
తన మెదటి తెలుగు సినిమా #Life లాంచ్ ప్రెస్ మీట్. pic.twitter.com/K3LxgVqSGP
