పరుచూరి వెంకటేశ్వరావుకు భార్యా వియోగం

పరుచూరి వెంకటేశ్వరావుకు భార్యా వియోగం

ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఈ రోజు(శుక్రవారం,ఆగస్టు-7) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె మరణించారు. విజయలక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్ ఫోన్ కాల్ చేసి పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ, ఇంటికి చేరుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు.