సవరణల నేపథ్యంలో ఫైనాన్స్​ బిల్లులో కొత్తగా 20 సెక్షన్లు

 సవరణల నేపథ్యంలో ఫైనాన్స్​ బిల్లులో కొత్తగా 20 సెక్షన్లు

న్యూఢిల్లీ: లోక్​సభ శుక్రవారం ఫైనాన్స్​ బిల్లు 2023 ను ఆమోదించింది. ఈ ఫైనాన్స్​ బిల్లుకు 64  సవరణలు చేశారు. ఎలాంటి చర్చ లేకుండానే లోక్​సభలో సవరణలతో కూడిన ఈ ఫైనాన్స్​ బిల్లును ఆమోదించారు. అదానీ గ్రూప్​ కంపెనీలపై జాయింట్​ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్​ చేస్తూ, ప్రతిపక్షాల సభ్యులు గొడవకు దిగడంతో ఫైనాన్స్​ బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు.

64 సవరణలతో కూడిన ఫైనాన్స్​ బిల్లును ఆమోదం కోసం లోక్​సభలో మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ప్రతిపాదించారు. బడ్జెట్​ను గురువారం నాడే ఆమోదించారు. సవరణల నేపథ్యంలో ఫైనాన్స్​ బిల్లులో కొత్తగా 20 సెక్షన్లను చేర్చారు. లోక్​సభ ఆమోదం రావడంతో ఈ ఫైనాన్స్​ బిల్లును ఇప్పుడు రాజ్యసభకు పంపనున్నారు.