ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల గార్బా డ్యాన్స్

ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల గార్బా డ్యాన్స్

రైళ్లు చాలా సార్లు లేట్ గా వస్తుంటాయి. ఈ రైళ్లు ఇంతే.. టైంకు రావంటూ చాలా సార్లు జోకులేసుకుంటాం. కానీ బుధవారం రాత్రి మధ్యప్రదేశ్ లోని రత్లాం రైల్వే స్టేషన్ లో మాత్రం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ రైలు సమయానికి 20 నిమిషాలు ముందుగా వచ్చింది. దీంతో ఆశ్చర్య పోయిన కొంత మంది ప్రయాణీకులు సంతోషంలో సంబురాలు చేసుకున్నారు. ప్లాట్ ఫాం పైకి వచ్చి సంప్రదాయ గర్భా డాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు.. బుధవారం రాత్రి 10 గంటల 35 నిమిషాలకు రత్లాం స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే 20 నిమిషాలకు ముందుగానే ట్రైన్ వచ్చింది. స్టేషన్ లో 10 నిమిషాల పాటు ఆగుతుంది. మొత్తం అరగంట టైం దొరకడంతో... ప్లాట్ ఫాం పైకి చేరుకున్న పదుల సంఖ్యలో ప్రయాణీకులు.. ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. హ్యాపీ జెర్నీ అని ట్వీట్ చేశారు. ట్రైన్ ముందుగా వస్తే అది నిజంగా సంతోషమేనని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.