శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆందోళన చేశారు. మధ్యా హ్నం 3.55 గంటలకు బెంగళూరుకు బయల్దేరాల్సిన ఎయిర్ లైన్స్ విమానం 4 గంటల గడుస్తున్నా కదలకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

ALSO READ :- వామ్మో... బంగారంతో పప్పు... వైరల్ అవుతున్న వీడియో

విమానం ఆలస్యానికి కారణం చెప్పకుండా అధికారులు దాట వేస్తున్నారని.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల్లో చిన్న పిల్లలు సైతం ఉండటంతో కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని, ప్రయాణికులను ఎయిర్ పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.