సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఏవోసీ గ్రౌండ్, ఈఎంఈ మిలటరీ గ్రౌండ్, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లలో నెలల తరబడి కఠిన శిక్షణ పూర్తి చేసిన దాదాపు 2 వేల మందికి పైగా అగ్నివీర్ సైనికుల పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా సైనిక అధికారులు మాట్లాడుతూ.. దేశ భద్రత, గౌరవం, సమగ్రత కాపాడేందుకు అగ్నివీర్ల పాత్ర కీలకమని, నిజాయితీ, దేశభక్తితో తమను తాము అంకితం చేసుకోవాలని యువ సైనికులకు పిలుపునిచ్చారు.
వెలుగు, పద్మారావునగర్
