పాస్​పోర్ట్ అపాయింట్​మెంట్​ రీ షెడ్యూల్

పాస్​పోర్ట్ అపాయింట్​మెంట్​ రీ షెడ్యూల్

హైదరాబాద్​, వెలుగు: ఈనెల 22న పాస్​పోర్టు అపాయింట్​మెంట్లను రీ షెడ్యూల్​ చేస్తూ హైదరాబాద్ రీజనల్​పాస్​పోర్టు ఆఫీసు నిర్ణయం తీసుకుంది. అయోధ్య భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 22 న సెలవు ప్రకటించింది.

దీంతో అపాయింట్​మెంట్లను మధ్యాహ్నం వరకు రీషెడ్యూల్​చేస్తూ  హెచ్​ఆర్​పీవో ప్రకటన జారీ చేశారు. పాస్​పోర్టు కేంద్రాలకు రాలేని వారు అందుబాటులోని మరో తేదీకి అపాయింట్​మెంట్స్ ను మార్చుకునే వెసులుబాటు ఉంది.