ముంబై: కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇండియాలో నెలకొన్న పరిస్థితిని చూసి ఆస్ట్రేలియా పేసర్ పాట్‌కమిన్స్ తన వంతు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. కమిన్స్రూ. 37.42 లక్షలు(50,000 అమెరికన్ డాలర్లు) మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు సోమవారం డొనేట్ చేశాడు. ఆక్సిజన్ అవసరాల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని పేసర్ కోరాడు. అలాగే, ఐపీఎల్కొనసాగాలన్నాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకు దక్కిన ప్లాట్‌ఫామ్‌ను మంచి కోసం ఉపయోగిస్తున్నా. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేశా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది చాలా చిన్నది అని నాకు తెలుసు. కానీ నేను చేసిన సాయం వల్ల కనీసం ఎవరో ఒకరికి మేలు జరుగుతుందని నమ్ముతున్నా. ఐపీఎల్ టీమ్‌మేట్స్‌తో పాటు ఇండియాతో అనుబంధం ఉన్న వారంతా సాయం చేయాలని కోరుతున్నా. ఇక, ఇలాంటి కష్ట సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించడం అవసరమా అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతుంది. టోర్నీ ఆగిపోతుందని అంటున్నారు. అయితే, ఇండియన్ గవర్నమెంట్‌కు నాదో మనవి. లాక్‌డౌన్‌వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఐపీఎల్ మ్యాచ్‌ల తో కొన్ని గంటల ఆట విడుపు లభిస్తోంది. కాబట్టి లీగ్‌ను కొనసాగించాలి’ అని కమిన్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
