CSK vs SRH: ధోనీని అధిగమించలేను..నా బాధ్యత అదే: సన్ రైజర్స్ కెప్టెన్

CSK vs SRH: ధోనీని అధిగమించలేను..నా బాధ్యత అదే: సన్ రైజర్స్ కెప్టెన్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో పాట్ కమ్మిన్స్ అత్యుత్తమ కెప్టెన్ గా పేరుంది. ఇతని కెప్టెన్సీలో ఒక్క ఏడాదిలోనే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు.. వన్డే వరల్డ్ కప్, యాషెస్ లను గెలుచుకుంది. ఈ కారణంగానే ఈ ఆసీస్ స్టార్ కు ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ కెప్టెన్సీని అప్పగించారు. ఎంతో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా దూసుకుపోతున్న కమిన్స్.. మిస్టర్ కూల్ ధోనీ దగ్గర తగ్గాడు . అతడిని అధిగమించడానికి ప్రయత్నించనని తెలియజేశాడు. 

ఉప్పల్ వేదికగా నేడు (ఏప్రిల్ 5) కొన్ని నిమిషాల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.ఈ మ్యాచ్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో కమ్మిన్స్ మాట్లాడాడు. "కెప్టెన్‌గా నా ప్రధాన పని మా కుర్రాళ్ల నుండి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే. ప్రత్యర్థి చెన్నై జట్టును చూస్తే చాలా పటిష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లో ధోనీని అధిగమించడానికి నేను ప్రయత్నించను. మీరు ఏ జట్టులో ఆడుతున్నా కెప్టెన్ మీద ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఉన్నారో మాకు తెలుసు. టీ20 అనేది కఠినమైన ఫార్మాట్. ప్రతి మ్యాచ్ లో గెలవడానికి 100 శాతం ప్రయత్నిస్తాం". అని కమిన్స్ టీవీ ఛానెల్‌తో అన్నారు.

కమిన్స్ కెప్టెన్ గా ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిచి మరో రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. 
నేడు (ఏప్రిల్ 5) చెన్నైతో కీలక పోరుకు సిద్ధమవుతుంది. సొంతగడ్డపై ఉప్పల్ లో ఈ మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది.