జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం : ఆదర్శ్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం : ఆదర్శ్ రెడ్డి
  • పటాన్​చెరు బీఆర్​ఎస్​ కోఆర్డినేటర్​ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్​ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ పటాన్​చెరు కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నేతలు కేటీఆర్​, హరీశ్​ రావు, తలసాని, సబితా, పద్మారావు, మహమూద్​అలీ తదితరులు జూబ్లీహిల్స్​ అభ్యర్థి సునీత గోపీనాథ్​కు మద్దతుగా ఈ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సారథ్యంలో జూబ్లీహిల్స్​ ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పరితపించిన గోపీనాథ్​ కుటుంబానికే నియోజకవర్గ ప్రజల మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్​ గెలిచి తీరుతుందని చెప్పారు. కార్యకర్తలంతా సమన్వయంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, మేరాజ్ ఖాన్​తదతరులు పాల్గొన్నారు.