ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లడం గులాబీ దళానికి షాక్ ఇచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసిన రోజునే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది.  కాంగ్రెస్ లో చేరేందుకే ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం సాగినా...ఆయన మాత్రం పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. బుధవారం ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.