నవ్వుతున్న సూరీడు!

నవ్వుతున్న సూరీడు!

ఈ ఫొటోను చూసి ఏదో కొత్త ఇమోజీనో, స్టిక్కర్, ఎడిట్ చేసిన ఫొటోనో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, ఇక్కడ నవ్వుతూ కనిపిస్తుంది ఎంటో కాదు.. సూర్యుడే. సోలార్ విండ్స్ వల్ల స్యూర్యునిపై పాచెస్ ఏర్పడ్డాయి. వాటి వల్లే స్యూర్యునికి కళ్ళు, ముక్కు, నోరులా ఏర్పడి నవ్వుతూ కనిపించాడు.

 నాసా 2010లో  సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సాటిలైట్ ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఆ సాటిలైట్ సూర్యుడి ఉపరితలం, వాతావరణాన్ని పరిశీలిస్తుంది. సౌర వ్యవస్థను అధ్యాయనం చేస్తుంది. నవ్వుతున్న సూర్యుడిని  తీసింది కూడా ఆ సాటిలైటే. సోలార్ విండ్స్ వల్ల ఏర్పడే ఈ పాచెస్ ని కరోనల్ హోల్స్ అంటారు. వాటివల్లే స్యూర్యుని ఉపరితలంపై రకరకాల ఆకారాలు ఏర్పడతాయని నాసా చెప్తుంది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సాటిలైట్ తీసిన వీడియోని నాసా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.