
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, హీరోయిన దీపికా పదుకునే నటించిన పఠాన్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 రోజుల్లోనే రూ.600కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. తాజాగా 7వ రోజూ అదే దూకుడును ప్రదర్శించిన పఠాన్.. ఇండియాలోనే రూ.325 కోట్ల గ్రాస్ ను చేరిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.320.25 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఒక్క రోజే రూ.21కోట్లు వసూలు చేయగా.. వారం రోజుల్లోనే బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో హిందీ చిత్రంగా పఠాన్ రికార్డు సృష్టించింది. అంతే కాదు 6 రోజుల్లోనే రూ.300కు పైగా కోట్లు వసూలు చేసిన మూవీగానూ పేరు తెచ్చుకుంది.
జనవరి 25న విడుదల పఠాన్ చిత్రం మొదటిరోజే రూ.57 కోట్లు వసూలు చేసి, భారతీయ సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టింది. రెండో రోజు రూ.70కోట్లకు పైగా బిజినెస్ చేసిన చిత్రంగానూ పఠాన్ నిలిచింది. ఇలా వారంతంలోనే, కేవలం 6రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ ను దాటింది. అంతే కాదు వరల్డ్ వైడ్ గానూ రూ.600 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా పఠాన్ రికార్డు సృష్టించింది.
దేశంలో పఠాన్ డే వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
మొదటిరోజు రూ.57 కోట్లు
రెండో రోజు రూ.70.50 కోట్లు
మూడో రోజు రూ.39.25 కోట్లు
నాల్గో రోజు రూ.53.25 కోట్లు
ఐదో రోజు రూ.60.75 కోట్లు
ఆరో రోజు రూ.26.50 కోట్లు
ఏడో రోజు రూ.21.00 కోట్లు
రికార్డు బద్దలు ...
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన పఠాన్ తో రికార్డు సృష్టించారు. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ బ్యానర్స్ పై విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజే రూ.67కోట్లు వసూలు చేసి కేజీయఫ్ 2, వార్, బాహుబలి2 లాంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే విడుదలకు ముందు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న ఈ చిత్రం.. ఇప్పుడు భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించడం గమనార్హం.