పేషెంట్లు మామూలు ట్రీట్‌మెంట్‌తోనే మంచిగైతున్నరు

పేషెంట్లు మామూలు ట్రీట్‌మెంట్‌తోనే మంచిగైతున్నరు

80 శాతం మందికి వార్డులోనే ట్రీట్​మెంట్​

నాలుగో స్టేజ్​లో ఉంటేనే ఐసీయూలో

ప్రస్తుతం సీరియస్​ కండిషన్​లో నలుగురే

మన దగ్గర మూడు రకాల కేసులు

కొందరిలో అవయవాలు ఫెయిల్యూర్‌

పాజిటివ్‌ వచ్చిన కొందరిలో లక్షణాలే లేవు

‘గాంధీ’ జనరల్ మెడిసిన్ వింగ్ హెచ్‌వోడీ డాక్టర్ రాజారావు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా కంట్రోల్‌‌లోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో 80శాతం మంది నార్మల్ ట్రీట్‌‌మెంట్‌‌తోనే కోలుకుంటున్నరని చెబుతున్నారు. కేవలం 15శాతం నుంచి 20శాతం మందికే ప్రొటోకాల్ ట్రీట్‌‌మెంట్ చేస్తున్నామని గాంధీ హాస్పిటల్‌‌ జనరల్ మెడిసిన్ విభాగం హెచ్‌‌వోడీ డాక్టర్‌‌‌‌ రాజారావు చెప్పారు. గాంధీలో కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్‌‌ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తున్న డాక్టర్ రాజారావుతో ‘వెలుగు’ స్పెషల్​ ఇంటర్వ్యూ…

వెలుగు ప్రతినిధి: ఎప్పుడు కరోనా సస్పెక్ట్​గా భావించాలి?

డా.రాజారావు: ప్రస్తుతం మన దగ్గర మూడు రకాల సస్పెక్టెడ్‌‌‌‌ కేసులు వస్తున్నయి. అందులో మొదటిది విదేశీ ట్రావెల్ హిస్టరీ, ఢిల్లీ మర్కజ్‌‌‌‌ లింక్‌‌‌‌ ఉన్న కేసులు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్స్‌‌‌‌ రెండో రకం. ట్రావెల్ హిస్టరీ, పాజిటివ్ కేసులతో కాంటాక్ట్‌‌‌‌ లేకపోయినప్పటికీ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌‌‌‌నెస్‌‌‌‌(ఎస్ఏఆర్‌‌‌‌‌‌‌‌ఐ) ఉన్నవాళ్లు మూడో రకం. వీళ్లను వేర్వేరుగా ఐసోలేట్‌‌‌‌ చేసి, స్వాబ్‌‌‌‌ తీసి టెస్టులకు పంపిస్తున్నం. గాంధీ హాస్పిటల్ బిల్డింగ్‌‌‌‌లోని 3,4,5,8వ ఫ్లోర్లలో ఉన్న వార్డులను అనుమానితుల కోసమే కేటాయించినం. ఆరు, ఏడో ఫ్లోర్లలోని వార్డుల్లో పాజిటివ్ పేషెంట్లను ఉంచినం. ఈ రెండు ఫ్లోర్లలోని వార్డుల్లో మొత్తం రెండొందల బెడ్లు అందుబాటులో ఉన్నయి.

వెలుగు:  కరోనా పేషెంట్లలో ఎలాంటి లక్షణాలు ఉంటున్నయి?

డా.రాజారావు: కరోనా పాజిటివ్ పేషెంట్లలో చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉంటున్నయి. కొందరిలో అసలు ఏ లక్షణాలూ ఉండడం లేదు. ఈ రెండు కేటగిరీల వాళ్లే సుమారు 80 శాతం మంది ఉంటున్నరు. 15 శాతం నుంచి 18 శాతం మందిలో తీవ్ర లక్షణాలు ఉంటున్నయి. కేవలం 2 శాతం నుంచి 5శాతం మందిలో మల్టీ ఆర్గాన్ డిస్‌‌‌‌ఫంక్షన్‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌(ఎంవోడీఎస్‌‌‌‌) ఉంటోంది. వీళ్ల పరిస్థితి కొంచెం సీరియస్‌‌‌‌గా ఉంటది.

వెలుగు: కోలుకోవడానికి కనీసం ఎంత టైమ్ పడుతుంది.

డా.రాజారావు: ఏ పేషెంట్‌‌‌‌కైనా పూర్తిగా కోలుకోవడానికి, వైరస్ సోకినప్పటి నుంచి 2 లేదా 3 వారాలు పడుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు హాస్పిటల్‌‌‌‌కు వచ్చేసరికి కనీసం 3, 4 రోజులు పడుతోంది. అందుకే అడ్మిట్ అయిన తర్వాత 9, 10 రోజులకు మళ్లీ స్వాబ్ తీసి టెస్టులు చేపిస్తున్నం. ఈ టెస్టులో నెగటివ్ వస్తే, 24 గంటల్లో మరోసారి టెస్ట్‌‌‌‌ చేపిస్తం. రెండోసారి కూడా నెగటివ్ వస్తే మళ్లీ అన్ని టెస్టులు చేసి, అంతా ఓకే ఉంటే డిశ్చార్జ్ చేస్తున్నం. డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజులు ఇంట్లో క్వారంటైన్‌‌‌‌లో ఉండాలని చెప్పి పంపిస్తున్నం.

వెలుగు: మన దగ్గర డిశ్చార్జ్‌‌‌‌ అయినవాళ్లలో సీరియస్ పేషెంట్లు ఉన్నరా?

డా.రాజారావు: ఇప్పటి వరకు మన స్టేట్‌‌‌‌లో 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 25 మంది ఫస్ట్, సెకండ్ కేటగిరీ వాళ్లే. సింపుల్ మెడిసిన్‌‌‌‌తోనే బయటవడ్డరు. ఆరుగురికి సివియర్ సింప్టమ్స్ ఉండే, మరో ఇద్దరికి మాత్రం ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఇండోనేసియాకు చెందిన వ్యక్తికి వైరస్ కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఆయన వయసు సుమారు 50 ఏండ్ల వరకూ ఉంటుంది. మనం ఇచ్చిన మెడిసిన్‌‌‌‌తో ఆయన కూడా పూర్తిగా కోలుకున్నడు. బీపీ, డయాబెటిస్ ఉన్న 63 ఏండ్ల మరో మహిళ సైతం, నాలుగో స్టేజ్‌‌‌‌కు వెళ్లి పూర్తిగా కోలుకున్నరు.

వెలుగు: పేషెంట్లకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నరు?

డా.రాజారావు: కరోనా పాజిటివ్ పేషెంట్లు, ఏవైనా తినొచ్చు. మార్నింగ్ మిల్క్‌‌‌‌, బ్రెడ్, బ్రేక్‌‌‌‌ఫాస్ట్ ఇస్తున్నం. లంచ్‌‌‌‌లో పప్పు, కూర, ఎగ్‌‌‌‌ ఇస్తున్నం. ఈవినింగ్‌‌‌‌ డ్రైఫ్రూట్స్‌‌‌‌, ఫ్రూట్స్ ఇస్తున్నం. రోజూ లీటర్ క్వాంటిటివీ నాలుగు మినిరల్ వాటర్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్ ఇస్తున్నం. అదనంగా పేషెంట్లు ఏవైనా కోరినా ప్రొవైడ్ చేస్తున్నం. ఫుడ్ విషయంలో రిస్ర్టిక్షన్స్ ఏమీ లేవు.

కొందరికి కౌన్సెలింగ్​ ఇస్తున్నం

మన దగ్గర పేషెంట్లలో చాలా వరకూ ఎడ్యుకేటెడ్‌‌, యూత్ ఉన్నారు. 80శాతం మంది పరిస్థితిని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతున్నారు. 20 శాతం మందికి కౌన్సెలింగ్ అవసరమవుతోంది. మేము ప్రతిరోజు మూడు, నాలుగు సార్లు వార్డుల్లో రౌండ్స్ వేస్తున్నం. వాళ్లతో మాట్లాడి మోటివేట్ చేస్తున్నం. స్పెషల్‌‌గా సైకియాట్రిస్ట్‌‌లను కూడా అందుబాటులో ఉంచినం. అవసరమైన పేషెంట్లకు వాళ్లు కౌన్సెలింగ్ ఇస్తున్నరు. ఒకే రూమ్‌‌లో 14 రోజులు ఉండడం వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్నుంచి బయటపడేందుకు మోటివేట్ చేస్తున్నం.

ట్రీట్‌‌మెంట్ ప్రొసీజర్‌‌‌‌ ఇట్ల..

పాజిటివ్ వచ్చిన వ్యక్తు లందరికీ చెస్ట్ ఎక్స్‌‌ రే, కిడ్నీ, లివర్‌ ఫంక్షన్ టెస్టు , రకరకాల రక్త, మూత్ర పరీక్షలు చేపిస్తు న్నం . వీళ్లలో ఎక్కువ మందికి దగ్గు, జలుబు లేదా ఫీవర్ ఉంటుంది. ఇలాంటి వాళ్లకు సింప్టమాటిక్ ట్రీట్‌‌మెంట్ ఇస్తు న్నాం. అంటే, ఫీవర్
ఉంటే క్రోసిన్ లేదా పారాసిటమాల్. జలుబు ఉంటే సిట్రజిన్ టాబ్లెట్లు ఇచ్చినం. సింప్టమ్స్‌‌ తగ్గిపోగానే ట్యాబ్లెట్లు ఆపేసినం. విటమిన్ సీ, బీ కాం ప్లెక్స్ టాబ్లెట్లు కొనసాగిస్తం . దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి, ఇన్ఫెక్షన్ ఉన్నవారికి రోజూ రెండుసార్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చినం. హెచ్‌ ఐవీ ట్రీట్‌‌మెంట్‌‌లో ఉపయోగిం చే లొపినవీర్‌ , రిటోనవీర్‌ కాం బినేషన్‌‌ కూడా వాడినం. రెండ్రోజుల తర్వాత డోస్‌‌ తగ్గించి మరో నాలుగు రోజుల పాటు అవే ట్యాబ్లెట్లు కొనసాగిస్తం . నాలుగో స్టేజ్‌‌లో ఉన్నవాళ్లను ఐసీయూలో పెట్టి ట్రీట్‌‌మెంట్ ఇస్తు న్నం. ఐసీయూలో 24 గంటల పాటు అన్ని రకాల స్పెషలిస్ట్‌‌ డాక్టర్లు అందుబాటులో ఉంటరు. ప్రస్తు తం నలుగురు పేషెంట్లు మాత్రమే ఐసీయూలో ఉన్నరు. ఐసీయూలో ఉన్నవాళ్లకు ప్రోటోకాల్ ట్రీట్‌‌మెంట్‌‌తో పాటు.. వాళ్ల కండీషన్‌‌ను బట్టి. స్ర్టాం గ్ యాంటిబయాటిక్ ఇంజక్షన్స్ ఇస్తు న్నం . వీళ్లలో ఆర్గాన్ ఫెయిల్యూర్స్
ఉంటున్నయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే దానికి సంబంధించి న మెడిసిన్, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే దానికి సంబంధించి న మెడిసిన్ యూజ్ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నం . కొందరిలోఈ వైరస్‌‌ అసింప్టమాటిక్
గా ఉంటోం ది. వీళ్లకి వైరస్ సోకినప్పటికీ ఏ సమస్యలూ లేవు. దగ్గు, జలుబు కూడా లేదు. వీళ్లకు రోజూ బీ కాం ప్లెక్స్‌‌, విటమిన్ సీ ట్యాబ్లెట్లు ఇస్తున్నం, వాటితో కోలుకుంటున్నరు.

For More News..

కరోనా టెస్ట్ ఎట్ల చేస్తరో తెలుసా?