డాక్టర్లు వస్తలేరు..ఓపీ చూస్తలేరు

డాక్టర్లు వస్తలేరు..ఓపీ చూస్తలేరు

హైదరాబాద్, వెలుగు:సూర్యాపేట జిల్లాకు చెందిన బాలింతకు న్యూరో ప్రాబ్లమ్​రావడంతో డాక్టర్లు సిటీకి రెఫర్​ చేశారు. న్యూరో ఫిజిషియన్​ను చూయించేందుకు ఫ్యామిలీ మెంబర్​ బీఎన్​రెడ్డిలోని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​కు తీసుకురాగా, ఓపీ లేదని చెప్పారు. ఎర్రగడ్డలోని మరో ప్రైవేట్​ఆస్పత్రికి వెళ్లగా, అక్కడా సేమ్ ప్రాబ్లమ్​. దాంతో ఓ కార్పొరేట్​ ఆస్పత్రిని ఆశ్రయించారు. గ్రేటర్​లోని ప్రైవేట్​హాస్పిటల్స్​కు వస్తున్న ఎందరో పరిస్థితి ఇదే. హాస్పిటల్స్​లో అన్నిరకాల సేవలు తిరిగి ప్రారంభించాలని సర్కార్ ​ఆదేశించినా యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. దాంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ ​చెకప్​లకూ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.

20% కూడా అందట్లే..

హైదరాబాద్​ జిల్లాలో ప్రైవేట్​హాస్పిటల్స్, క్లినిక్​లు, నర్సింగ్​ హోమ్​లు కలిపి 1,228 ఉన్నాయి. లాక్​డౌన్​కు ముందు వాటిల్లో డైలీ 15 వేల మంది ట్రీట్​మెంట్​పొందేవారు. 10 వేల మంది దాకా ఇన్​పేషెంట్లు ఉండేవారు. లాక్​డౌన్​తో అన్నింట్లో ఓపీ సేవలు క్లోజ్​అయ్యాయి. కొన్నింటిలో ఎమర్జెన్సీ సేవలూ నిలిచిపోయాయి. సేవలు స్టార్ట్​ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా సిటీలో 20 శాతంలోపు హాస్పిటల్స్​మాత్రమే ప్రారంభించాయి. వాటిలో క్లినిక్​లే ఎక్కువ ఉన్నాయి. కొన్ని హాస్పిటళ్లు ఆన్​లైన్​లో సేవలందిస్తున్నా.. టెక్నాలజీపై అవగాహన లేనివాళ్లు, ఎమర్జెన్సీ కేసుల వాళ్లకు ఉపయోగపడడం లేదు. హాస్పిటళ్లకు డాక్టర్లు రాకపోవడంతో టెస్టుల్లేక డయాగ్నస్టిక్ ​సెంటర్లూ పూర్తిస్థాయిలో ఓపెన్​ కాలేదు.

యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే..

లాక్​డౌన్​ సడలింపులతో ఓపీ చూసేందుకు డాక్టర్లు, స్టాఫ్​ భయపడుతున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. ఎంట్రెన్స్​లో థర్మల్​స్క్రీనింగ్​, వెయింట్​ హాల్​లో ఫిజికల్​ డిస్టెన్స్​కు ఏర్పాట్లు, సెక్యూరిటీ, స్టాఫ్​ పెంపు, అదనపు ఏర్పాట్లను భారంగా భావిస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాక పేషెంట్ల సరిగ్గా రాకపోతే నష్టపోతామని చెప్తున్నాయి. తమ దగ్గర ట్రీట్​మెంట్ పొందిన వ్యక్తికి కరోనా పాజిటివ్​ ఉంటే, హాస్పిటల్​ను 24 రోజులు క్వారంటైన్ ​చేస్తుండడమూ ఇబ్బందిగా మారిందని పలువురు వాపోతున్నారు.

ప్రికాషన్స్​ పాటిస్తూ ట్రీట్​మెంట్​​

ప్రైవేట్​ హాస్పిటల్స్​ అన్ని రకాల సేవలు ప్రారంభిం చాలని ప్రభుత్వం చెప్పిం ది. పేషెంట్​కు కరోనా సింప్టమ్స్​ కనిపిస్తే సెలక్టివ్​హాస్పిటల్స్​కు రెఫర్​ చేయాలి. మా హాస్పిటల్​లో అన్నిరకాల సేవలు ప్రారంభించాం. డైలీ 30 ఓపీలు వస్తున్నాయి. పీపీఈ కిట్లు, మాస్క్​లు ధరించి చికిత్స అందిస్తున్నాం. డాక్టర్లంతా ధైర్యంగా ముందుకు రావాలె.

‑ డాక్టర్ విజయ్ ​భాస్కర్,  రవి హిలియోస్​ హాస్పిటల్ ​ఎండీ

కరోనా భయంతో వస్తలేరు

కరోనా ఎఫెక్ట్​తో డాక్టర్లు, సిబ్బంది డ్యూటీలకు రాట్లేదు. ఓపెన్ ​చేసినా ప్రొటోకాల్ సాధ్యం కాని పని. రోగి వెంట ఒక అటెండర్ మాత్రమే రావాలంటే వినరు. ఇలాంటివి సమస్యలెన్నో ఉన్నాయి. ఆస్పత్రులు పూర్తిస్థాయిలో తెరుచుకోవాలంటే టైం పడ్తది.

‑ డాక్టర్ రాకేశ్​​ నర్సింగ్​ హోమ్స్అసోసియేషన్​ స్టేట్ వైస్ ప్రెసిడెంట్

ఆస్పత్రులు సీజ్​ చేయొద్దు

ఈ మధ్య సిటీలోని ఓ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్​వచ్చిందని 24 రోజులు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆ ఎఫెక్ట్​ చాలా ఆస్పత్రుల మీద పడింది. ప్రభుత్వం ఆస్పత్రులకు గైడ్​లైన్స్​ఇవ్వాలి. సీజ్​ చేయడం సరికాదు.

‑ డాక్టర్ ​హరిప్రకాశ్, నెట్​వర్క్ హాస్పిటల్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ

ఉస్మానియాలో అన్నిసేవలు ఉన్నయ్

గవర్నమెంట్ హాస్పిటల్స్​ గాంధీ, కింగ్ కోఠిని కరోనా పేషెంట్స్​ కోసం కేటాయించారు. జనరల్, ఎమర్జెన్సీ సేవలు ఉస్మానియాకు వెళ్లొచ్చు. అక్కడ డిపార్ట్