హైదరాబాద్ అత్తాపూర్లో GHMC కొరడా.. అంబియన్స్ ఫోర్ట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ అత్తాపూర్లో GHMC కొరడా.. అంబియన్స్ ఫోర్ట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు పై GHMC స్పెషల్ పోకస్ పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల తొలగింపుకు చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 01) అత్తాపూర్ డివిజన్ అంబియన్స్ ఫోర్ట్ లో అనుమతులు లేని నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. 

 నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అదనపు అంతస్తులు,సెట్ బ్యాక్ అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య  జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 

►ALSO READ | శ్రీశైలంలో భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ..

సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.