గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోరు కనిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్ కు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా..రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్ ,14న రెండో విడత , 17న మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మూడు గ్రామపంచాయతీలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడ, గూడెం గ్రామాల ప్రజలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ ఫేజ్ కు మూడు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. తమ డిమాండ్లు పరిష్కరించకపోవడమే ఈ నిర్ణయానికి కారణమంటున్నారు.
దండేపల్లి మండలంలోని గూడెం, నెల్కి వెంకటాపూర్ గ్రామాలను జనరల్ కేటగిరీగా మార్చాలని రెండు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గూడెం, నెల్కి వెంకటాపూర్ గ్రామాల్లో ఎస్టీ వర్గానికి చెందిన కులస్తులు ఎవరు లేకపోయినా ఎస్టీ రిజర్వ్ చేయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వంలో వందూర్ గూడను ప్రత్యేక గ్రామపంచాయతీగా చేశారని తిరిగి నెల్కి వెంకటాపూర్ గ్రామంలోనే విలీనం చేయాలని వందూర్ గూడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడ గ్రామాలు రెండు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని వందూర్ గూడ గ్రామస్తుల చెబుతున్నారు.
►ALSO READ | కడ్తాల్ మండలంలో హై టెన్షన్ లైన్ నిర్మాణంలో.. రైతులకు నష్టం జరగకుండా చూడండి : బిహారి రత్
ఇక గూడెం గ్రామంలో35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నికలు జరగడం లేదని తమ సమస్యలపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు గ్రామస్తులు. దీంతో ఈ మూడు గ్రామాల నుంచి సర్పంచ్ లేదా వార్డ్ సభ్య పదవులకు ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని తెలిపారు. ఈ దండేపల్లి మండలంలోని ఈ గ్రామాలు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడత నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో ఈ మూడు గ్రామపంచాయతీలో ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం పట్ల గ్రామస్తుల బహిష్కరణ వెలుగుకి వచ్చింది.
