Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కాదు.. అంతకు మించి: కోహ్లీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కాదు.. అంతకు మించి: కోహ్లీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ మరోసారి తనదైన శైలిలో చెలరేగాడు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ పరుగుల వరద పారించాడు. ఆదివారం (నవంబర్ 30) రాంచీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. ఓవరాల్ గా 120 బంతుల్లో 135 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీకి వన్డే ఫార్మాట్ లో ఇది 52వ సెంచరీ కావడం విశేషం. క్రికెట్ లో ఇప్పటివరకు ఒక ఫార్మాట్ లో 52 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

తొలి వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "నేను నా ఫిట్‌నెస్‌పై కష్టపడి పనిచేస్తాను. మానసికంగా నేను బలంగానే ఉండాలనుకుంటాను. నేను మానసికంగా బలంగా ఉన్నప్పుడే పరుగులు సాధించగలను. నేను ఏదైనా మ్యాచ్ ఆడుతున్నట్లైతే 120 శాతం ఎఫర్ట్స్ పెడతాను. నా వయసు 37. నా ఫిట్ నెస్ పై మరింత జాగ్రత్త తీసుకోవాలి. మానసికంగా బలంగా ఉన్నంత కాలం క్రికెట్ ఆడతాను. ఈ రోజు మ్యాచ్ లో బాగా ఆడడం సంతోషంగా అనిపించింది.  పిచ్ ఆరంభంలో బాగుంది. ఆ తర్వాత స్లో అయింది. పరిస్థితులు ఎలా ఉన్నపటికీ నేను దూకుడుగా ఆడడానికే ప్రయత్నించాను". అని కోహ్లీ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. 

టెస్ట్ క్రికెట్ మళ్ళీ ఆడే ఉదేశ్యం లేదని పరోక్షంగా చెప్పాడు. ఒకే ఫార్మాట్ లో కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ కామెంట్స్ ఫ్యాన్స్ కు  సంతోషాన్ని ఇస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా విరాట్ క్రికెట్ లో కొనసాగే అవకాశం ఉంది. నిన్నటివరకు కోహ్లీకి 2027 వన్డే వరల్డ్ కప్ చివరిదనే ప్రచారం జరిగింది. కోహ్లీ మాత్రం రాంచీలో సెంచరీ కొట్టిన తర్వాత ఫిట్ గా ఉన్నంత కాలం క్రికెట్ లో కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. దీంతో కోహ్లీ ఫామ్ లో ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

►ALSO READ | నేషనల్ ఆర్చరీ విన్నర్ కొల్లూరు డీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తొలి వన్డేలో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ:

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కష్టపడి గెలిచింది. ఆదివారం (నవంబర్ 30) రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ (120 బంతుల్లో 135: 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టిస్తే.. ఆ తర్వాత బౌలింగ్ లో కుల్దీప్, హర్షిత్ రానా అదరగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కో జాన్సెన్ (70), మాథ్యూ బ్రీట్జ్కే (72), కార్బిన్ బాష్ (67) సౌతాఫ్రికా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.