హైదరాబాద్, వెలుగు: ఇంటర్- డీపీఎస్ నేషనల్ లెవెల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆతిథ్య కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కైవసం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 17రాష్ట్రాల నుంచి 200 మంది ఆర్చర్లు అండర్-10, 13, 15, 17 ఏజ్ కేటగిరీల్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో పోటీ పడ్డారు.
ఆదివారం ముగిసిన ఈవెంట్‌లో హైదరాబాద్‌కే చెందిన మూడు స్కూల్స్ టాప్–3లో నిలిచాయి. మియాపూర్ డీపీఎస్ రన్నరప్‌గా నిలవగా.. నాదర్గుల్ థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది. విన్నర్లకు కొల్లూరు డీపీఎస్ వైస్ చైర్మన్ టి.భీమ్‌సేన్, ప్రిన్సిపల్ సి.జె.వసంత మెడల్స్ అందజేశారు.
