IND vs SA: గిల్ కారణంగానే ఆలస్యం.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే..?

IND vs SA: గిల్ కారణంగానే ఆలస్యం.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే..?

టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతూ బిజీగా ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ముగిసిన తర్వాత సఫారీలతో 5టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మరో వారం రోజుల్లో సిరీస్ స్టార్ట్ కానుంది. అయితే టీమిండియా స్క్వాడ్ ను సెలక్టర్లు ఇంకా ప్రకటించలేదు. రిపోర్ట్స్ ప్రకారం టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కోసం టీ20 స్క్వాడ్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండడంతో గిల్ ను బీసీసీఐ ఖచ్చితంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో ఆడించే ఉదేశ్యంలో ఉన్నట్టు టాక్. మంగళవారం (డిసెంబర్ 2) భారత టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది.  

సౌతాఫ్రికాతో మెడ నొప్పి కారణంగా తొలి టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోయిన గిల్..ఆ తర్వాత జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. మెడ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ గిల్ ను ఎంపిక చేయలేదు. వస్తున్న సమాచార ప్రకారం గిల్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు గిల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిల్ కారణంగానే టీ20 స్క్వాడ్ ఆలస్యం అయినట్టు సమాచారం. తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు గిల్ గాయంపై అప్ డేట్ ఇచ్చారు.

►ALSO READ | Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కాదు.. అంతకు మించి: కోహ్లీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
 
"ప్రస్తుతానికి గిల్ బాగున్నాడు. గిల్ కోల్‌కతా నుండి గౌహతి, గౌహతి నుండి ముంబై, ముంబై నుండి చండీగఢ్.. ఇప్పుడు చండీగఢ్ నుండి బెంగళూరు వరకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విమానాలలో ప్రయాణించాడు. ప్రస్తుతం అతన్ని జట్టులోకి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగని గిల్ ను తొందర పెట్టట్లేదు. అతను 100% ఫిట్ నెస్ సాధిస్తేనే సౌతాఫ్రికాతో సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. అతను ఒక ముఖ్యమైన ఆల్-ఫార్మాట్ ఆటగాడు. అతను త్వరగా ఫిట్ నెస్ సాధించి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. 

డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్: 

వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.