బయటి నుంచి వస్తున్న వారి వల్లే ఢిల్లీలో ఎక్కువ కేసులు: హెల్త్‌ మినిస్టర్‌‌

బయటి నుంచి వస్తున్న వారి వల్లే ఢిల్లీలో ఎక్కువ కేసులు: హెల్త్‌ మినిస్టర్‌‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బయటి నుంచి వస్తున్న వారి వల్లే కేసులు పెరిగుతున్నాయని స్టేట్‌ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ అన్నారు. శనివారం కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. “ ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బయట నుంచి ఢిల్లీకి వచ్చిన వారు ఇక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు. అందుకే కేసుల సంఖ్య పెరుగుతోంది. లేకపోతే కేసుల సంఖ్య తగ్గేది. బయటి పేషంట్లు ఎక్కువగా రావడం వల్ల హాస్పిటల్‌ అడ్మిషన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి” అని మంత్రి చెప్పారు. ఢిల్లీలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కాగా.. శనివారం ఒక్కరోజు 1404 కేసులు నమోదయ్యాయి. 16 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,44,127కి చేరింది.