ఎంపీ టికెట్‌ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్‌ కలిశారు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎంపీ టికెట్‌ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్‌ కలిశారు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్‌ కలిశారని ఆరోపించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్‌ కర్చీఫ్‌ వేశారని అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ

ఎంపీ టికెట్‌ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నారని జగ్గారెడ్డి ఫోకస్‌ కావడం కోసమే తన పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. 

గోవా పోతా ఎంజాయ్ చేస్తా..

రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్‌ చేస్తానని మల్లారెడ్డి అన్నారు.  తనకు గోవాలో హోటల్‌ ఉందని చెప్పారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్‌ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్‌ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మల్లారెడ్డి తెలిపారు.