వెనక్కి తగ్గని పవన్‌.. మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు..

వెనక్కి తగ్గని పవన్‌.. మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు..

సీఎం వైఎస్‌ జగన్‌ను మరోసారి టార్గెట్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన వారాహి బహిరంగసభలో.. జగన్ గారు నమస్కారం అండి.. నేను జనసేన అధ్యక్షుడిని పవన్ కల్యాణ్‌.. తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్న అండి అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.

 సహజనటుడు ,హావభావాలతో అందరినీ డామినేట్ చేసే మహానటుడు  ఎస్వీ రంగారావు గారికి నా  పాదాభివందనం తెలియజేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.  భగత్ సింగ్ ,బాబా సాహెబ్ అంబేద్కర్ అందరూ త్యాగాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు..వారే మనకి మనందరికీ స్ఫూర్తి...... ఉద్యోగ భద్రత, రైతుల సుభిక్షంగా, యువత కోసం నేను ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఎప్పుడూ కూడా ఆడవారి జోలికి పోని భారత సంస్కృతిని ఈ  వైఎస్ జగన్ తన ఇంటిలో ఆడవారి జోలికి వచ్చాడని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. మీ భార్య భారతి మేడమ్ గారి  ప్రస్తావన  నేను తీసుకురాలేదు...ఆవిడని అడుగు.... కానీ నువ్వు నా ఇంటిలో వారి మీద వ్యక్తిగతంగా దాడి చేయిస్తున్నావని ఏకవచనంతో సీఎం జగన్ ను విమర్శించారు. 

సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలవడానికి కారణం ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేదు గనేకే అన్నారు పవన్‌.. మీరు మా కుటుంబాన్ని, జనసేన వీర మహిళలను కించ పరిచినా ఏం మాట్లాడ లేదు.. పెళ్లాం, పెళ్లాం అని మాట్లాడతావ్ ఏంటి జగన్‌? ఇలాంటివి భరించాల్సి వస్తుంది అని చెప్పా.. చిన్న పిల్లల కార్యక్రమంలో భార్య గురించి మాట్లాడే అంత సంస్కార హీనులా మీరు? అంటూ ప్రశ్నించారు. వాలంటీర్స్ ఎర్ర చందనం తరలింపు లో పట్టుబడ్డారు.. చిన్నారుల పై అఘాయిత్యాలు చేస్తున్న వారికి కాళ్ళు కడిగి దైవాంశ సంభూతులు అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.