
- అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్ కుమార్
పాల్వంచ, వెలుగు : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జి పవన్ కుమార్ ఎన్నికయ్యారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెం ట్ ఇంజినీర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా టి మహేశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా కె .కుమారస్వామి, అడిషనల్ జనరల్ సెక్రటరీగా కే రామకృష్ణ ఎన్నికయ్యారు. కేటీపీఎస్ బ్రాంచ్ సెక్రట రీగా రఘువీర్, అడిషనల్ బ్రాంచ్ సెక్రటరీగా భాగ్యరాజు, బ్రాంచ్ కోశాధికారిగా అఖిలేశ్ ఎన్నికయ్యారు.
ఈనెల 2న తెలంగాణ రాష్ట్రంలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్ కో, ట్రాన్స్ కో పరిధిలోని 38 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల్లో 2,069 మంది ఏఈలకుగాను 1,809 మంది ఏఈలు ఓటు హక్కును వినియోగించుకోగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్ని కల పోలింగ్ బాక్స్ లు పాల్వంచలోని కేటీపీఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్ హాల్ కు తరలించి శుక్రవారం లెక్కించారు. కేటీపీఎస్ 7వ దశకు చెందిన బి రవి నేతృత్వంలో నిర్వ హించిన ఈ ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్ని కైన అభ్యర్థులను ప్రకటించారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.పవన్ కుమార్ సమీప ప్రత్యర్థి పీవీబీ వేణుగోపాల్ పైన 328 ఓట్ల ఆదిత్యంతో విజయం సాధించారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఎం చందు ఎస్ శ్రీనాథ్ పైన 506 ఓట్ల ఆదిక్యంతో విజ యం సాధించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ.అజిత్ కుమార్ పైన ఆర్ సీ భరత్ కుమార్ 394 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించా రు. ప్రచార కార్యదర్శిగా ఎస్ హరినాథ్ పైన బి మహిపాల్ 758 ఓట్ల ఆదిత్యంతో విజయం సాధించారు.
టెక్నికల్ సెక్రటరీగా హెచ్ రజిత రెడ్డి షీహెచ్ దత్తు కుమార్ పైన 453 ఓట్ల ఆధిక్యం తో విజయం సాధించారు. సీనియర్ సెక్రటరీగా డీ.వంశీ ఆర్ నవీన్ పైన 632 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. రెండు సంవత్సరాలు పాటు కొన సాగే ఈ కమిటీ పారదర్శకంగా పనిచేస్తుందని చీఫ్ ఎన్నికల అధికారి బి.రవి తెలిపారు వీరు కాకుండా డివిజన్ల పరిధిలో పలు వురు విజయం సాధించారు. ఈ మేరకు ఇంజినీర్లు సంబరాలు జరుపుకొన్నారు.