
- సహస్రధారలతో ప్రత్యేక స్నపనం
- శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల మహోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి సీతారామయ్యకు పవిత్రారోపణం చేశారు. ముందుగా స్వామికి వేదవిన్నపాలు చేశారు. ఈ క్రమంలో ఉత్సవమూర్తులకు బేడా మండపంలో సహస్రధారలతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. హవనం అనంతరం పవిత్రాలను ప్రధాన ఆలయం నుంచి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ముందుగా గర్భగుడిలో మూలవరులకు ధరింప చేసి ఆలయప్రాంగణంలో ఉత్సవమూర్తులకు, లక్ష్మీతాయారు అమ్మవారికి , ఆంజనేయస్వామికి, భక్తరామదాసుకు, గోదాదేవికి చివరగా ఆలయ శిఖరంపై సుదర్శన చక్రానికి, ఆకాశ సీతారాములకు, ధ్వజస్తంభాతనికి, బలిపీఠానికి పవిత్రాలను ధరింపజేశారు. అలాగే అర్చకులు సైతం పవిత్రాలను ధరించారు. ప్రతీ ఏటా ఆలయంలో సకల దోష నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ వేడుకలను భక్తులు తిలకించి పులకించారు.