వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బోణీ కొట్టిన పవన్

వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బోణీ కొట్టిన పవన్

లివర్‌‌‌‌పూల్‌‌‌‌: ఇండియా బాక్సర్‌‌‌‌ పవన్‌‌‌‌ బర్త్‌‌‌‌వాల్‌‌‌‌.. వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బోణీ చేశాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ 55 కేజీల తొలి రౌండ్‌‌‌‌లో పవన్‌‌‌‌ 3–2తో మైకేల్‌‌‌‌ డగ్లస్‌‌‌‌ డా సిల్వా ట్రిండాడే (బ్రెజిల్‌‌‌‌)పై గెలిచాడు. 

మెగా టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన పవన్‌‌‌‌ వ్యూహాత్మకంగా కార్నర్స్‌‌‌‌ వైపు కదులుతూ పంచ్‌‌‌‌ల వర్షం కురిపించాడు. పదునైన జబ్స్‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌ హుక్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్‌‌‌‌లో కాస్త తేరుకున్న బ్రెజిల్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ పంచ్‌‌‌‌లతో ఎదురుదాడి చేసినా పవన్‌‌‌‌ సమర్థంగా తిప్పికొట్టాడు. డిసైడర్‌‌‌‌లో బలమైన అప్పర్‌‌‌‌ కట్స్‌‌‌‌తో డగ్లస్‌‌‌‌ను కట్టడి చేశాడు.