V6 News

Hari Hara Veera Mallu: ఫైనల్స్‌‌‌‌కు చేరిన పవన్ హరిహర వీరమల్లు

Hari Hara Veera Mallu: ఫైనల్స్‌‌‌‌కు చేరిన పవన్ హరిహర వీరమల్లు

ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే  మరోవైపు ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ముందుగా ఆయన నుంచి రాబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుందని ప్రకటించారు మేకర్స్.

గురువారంతో హైదరాబాద్‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ షూట్ పూర్తయిందని,  డిసెంబర్ మొదటి వారంలో  ఫైనల్ షెడ్యూల్‌‌‌‌ను విజయవాడలో  స్టార్ట్   చేస్తున్నట్టు తెలియజేశారు. 

ఈ షెడ్యూల్‌‌‌‌లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌‌‌‌తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌తో షూటింగ్  మొత్తం పూర్తి కానుంది. దర్శకుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో  చారిత్రాత్మక యోధుడి పాత్రలో  పవన్ కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుంది. బాబీ డియోల్  కీలక పాత్ర పోషిస్తుండగా,  అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఏఎం రత్నం సమర్పణలో  ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.