ఐదేళ్లుగా ఏపీ దోపిడీకి గురైంది...వైసీపీ గడీలు బద్దలు కొడతాం: పవన్​ కళ్యాణ్​

ఐదేళ్లుగా ఏపీ దోపిడీకి గురైంది...వైసీపీ గడీలు బద్దలు కొడతాం: పవన్​ కళ్యాణ్​

సిద్దం ...సిద్దం ....సిద్దం ...అంటున్న వైఎస్​ జగన్​ కు  యుద్దం యుద్దం అని తాడేపల్లి గూడెం సభలో పవన్​కళ్యాణ్​ అన్నారు. రైతులను, యువతను , మహిళలను. ఉద్యోగులను  ఐదేళ్లుగా సీఎం జగన్​ మోసం చేశారన్నారు. మేం మోసే టీడీపీ.. జనసేన జండాలు విజయానికి స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ అన్నారు. 2024 లో విజయానికి ఈ జండాలే స్ఫూర్తి అన్నారు.   పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు.. గొంతు ఎత్తితే ఒక దేశపు జండాకు ఉన్నంత పొగరు ఉంది. ఏదైనా మాట్లాడుదామంటే దాడులు చేస్తున్నారు. 

జగన్​ పాలనలో రోడ్లు బాగున్నాయని పగటి కలలలో ఉన్నారు.  వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడొద్దన్నారు. క్లాస్​ వార్​ అని చెప్పే జగన్​..  క్యాస్ట్​ వార్​ చేస్తున్నారన్నారు. ప్రజలపై దాడి చేస్తే మక్కెలు విరగ్గొట్టి మడతమంచంలో పడేస్తా...  మేం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్యం కోసమే.. ఇప్పటి వరకు పవన్​ కళ్యాణ్​ లో శాంతి..మంచితనం మాత్రమే చూశారు. జగన్​ కు యుద్దం అంటే ఏమిటో  చూపిస్తానన్నారు. ఐదుగురి కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారన్నారు.

ప్రజాస్వామ్యానికి కాపాడటానికే పొత్తులు పెట్టుకున్నామని పవన్​ కళ్యాణ్​ అన్నారు.  మనలో మనం కలహాలు పెట్టుకుంటే మళ్లీ వైసీపీకి అధికారం పోతుందన్నారు. చంద్రబాబు అనుభవం కావాలనే పొత్తు పెట్టుకున్నా.. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్​ కోసమేనని పవన్​ అన్నారు. ఐదేళ్లుగా దోపిడీక గురైన ఆంధ్రప్రదేశ్​ గా మారిందన్నారు.  చంద్రబాబు ఒక నగరాన్ని నిర్మించారు. చంద్రబాబు లాంటి రాజకీయ దురందురిడితో పొత్తు పెట్టున్నామన్నారు.మూడు ముక్కల ఐడియాలు.. మూడు ముక్కల సీఎం జగన్​..  అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందన్నారు.  రాజధానికి వెళ్లాలంటే మూడు చోట్లకు పరిగెత్తాలి.  జగన్​ కు గ్లోబెల్స్​ గతే పడుతుంది.  

జగన్​ ఉదయం డబ్బులిచ్చి... సాయంత్రం సారా రూపంలో తీసుకుంటాడని పవన్​ అన్నారు.  యువత భవిష్యత్తు బాగుండాలనే తపన పడుతున్నానన్నారు. సీఎం జగన్​ ఇచ్చేది చేయూత కాదు.. చేతివాటం.. ప్రజలు ప్రాంతాలు.. కులాల మధ్య కొట్టుకోవద్దు. కోట్లు సంపాదించుకొనే అవకాశాలు వదిలి మీకోసం వచ్చా... నా ఒక్క ఎమ్మెల్యేను తీసుకెళ్లారు.

ALSO READ :- ఆన్లైన్ ఫ్రాడ్: ఆవులు అమ్ముతామని..రూ.30 వేలు కొట్టేశారు

జగన్​ గుర్తు పెట్టుకో.. అథ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్​​ కాదు.. జనసేన పార్టీ కాదు.  పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకొంటే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.  జనసేన ఒక్క సీటు గెలిస్తేనే రాజమండ్రిలో ఒక్క రాత్రే రోడ్లు వేశారు. జనసేన 24 సీట్లు గెలిస్తే ఏం జరుగుతుందో చూడాలి. సామాన్యుడు రాజకీయం చేస్తే ..  భరించలేకపోతున్నారు. వ్యూహాలు రచిస్తాం..జగన్​ నీ కోటను బద్దలు కొడతాం... పవన్​ కళ్యాణ్ తో శతృత్వం అంటే అవతలి వాడు చచ్చేదాకా​ అంటే ఆంధ్రప్రదేశ్​ ప్రజల భవిష్యత్తు.. పవన్​ తో స్నేహమంటే పవన్​ చచ్చేదాకా.. పవన్​ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉండే కండువా.. సొంత చెల్లెలినే గోడకేసి కొట్టిన వ్యక్తి సీఎం జగన్​ .. జగన్​ వెంట ఉన్నది భజన బృందం. 

నాకు సలహాలు ఇచ్చే వారు నాకు అవసరం లేదు.. నాతో నడిచే వాళ్లు నావాళ్లు అన్నారు.  నేను రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఆలోచించాన్నారు.  పదేళ్లుగా అవమానాలు ఎదుర్కొన్నా.. ఎక్కడో కూర్చొని ప్రశ్నించకండి.. మద్దతివ్వండి.. యుద్దం చేసే వారు కావాలి. 2024 ఎన్నికలకు మహా యుద్దానికి శంఖారావం పూరిస్తున్నానన్నారు.  టీడీపీ.. జనసేన పొత్తు గెలవాలి.. జగన్​ పోవాలి.. మరోసారి ప్రధానిగా మోదీ రావాలని పవన్​ కళ్యాణ్​ అన్నారు.