భీమ్లా నాయక్ ఆగయా.. పవన్ పవర్ ఫుల్ ఎంట్రీ

V6 Velugu Posted on Aug 15, 2021

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. పవన్ ,రానా కాంబినేషన్లో  సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో వస్తున్ మూవీకి భీమ్లా నాయక్ అనే టైటిల్, సినిమాను జనవరి 12 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న సాంగ్స్ రాబోతున్నాయి. అంతేగాకుండా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. లుంగీతో కోపంగా వస్తున్ పవన్..అరేయ్ డేనీ బయటకు రారా అంటూ డైలాగ్ మాస్ ప్రేక్షకులకు ఊపునిస్తుంది. ‘డేని డేనియర్ శేఖర్ అని రానా చెబుతుండగా..భీమ్లా..భీమ్లా నాయక్ ..ఏంటి చూస్తున్నావ్..కింద క్యాప్షన్ లేదనా? అక్కర్లేదు బండెక్కు అంటూ పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కు  పవన్ ఈజ్ బ్యాక్ అనేలా అనిపిస్తోంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

 

 

Tagged rana, jan12, Pawan kalyan bheemla nayak, first glimpse

Latest Videos

Subscribe Now

More News