రివ్యూ: భీమ్లా నాయక్

రివ్యూ: భీమ్లా నాయక్

రివ్యూ: భీమ్లా నాయక్
రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: పవన్ కళ్యాణ్,రానా,నిత్యా మీనన్,సంయుక్త మీనన్,మురళీ శర్మ,సముద్ర ఖని, రావురమేష్ ,పమ్మి సాయి,శత్రు, కాదంబరి కిరణ్, తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్
మ్యూజిక్: తమన్
స్క్రీన్ ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: సుర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 25,2022

కథేంటి?

భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఫ్రెండ్ పెళ్లికోసం తెలంగాణ నుంచి ఆంద్ర వెళ్తున్న డానియల్ శేఖర్ (రానా) ను చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు మందు బాటిళ్లతో పట్టుకుంటారు. ఈగో హర్ట్ అయిన డానియల్ పోలీసుల మీద చేయి చేసుకుంటాడు. దాంతో భీమ్లానాయక్ డానియల్ ను అరెస్ట్ చేసి లోపలేస్తాడు.దాంతో తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భీమ్లా మీద కక్ష కడతాడు.తన జాబ్ పీకేయిస్తాడు.దాంతో భీమ్లా కూడా తెగిస్తాడు.ఇద్దరి మధ్య ఈగోల వల్ల పెద్ద గొడవ అవుతుంది. తర్వాత ఏం జరిగింది.? వీళిద్దరి గొడవ సద్దుమణిగిందా లేదా అనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో రాణించాడు. భీమ్లా నాయక్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. చాలా రోజుల తర్వాత తన యాంగ్రీనెస్ తో మాస్సివ్ పర్ఫార్మెన్స్ పండించాడు.ఇక రానా కూడా ఎక్కడా తగ్గలేదు. ఈ పాత్ర తను తప్పా ఎవరూ చేయలేరు అనేలా అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించాడు. నిత్యా మీనన్ తన పరిధిమేర నటించింది. సంయుక్త  మీనన్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. సముద్ర ఖని బాగా చేశాడు.రావు రమేష్ తన మార్కు నటనతో నవ్వులు పూయించాడు.ఇక మురళీ శర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. తనికెళ్ల భరణి,పమ్మి సాయి తదితరులు తమ పరిధిమేర నటించారు. 

టెక్నికల్ వర్క్:

టెక్నీషియన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు.కొన్ని సాదాసీదా సీన్లను కూడా తన ఆర్.ఆర్ తో ఎలివేట్ చేశాడు.పాటలు కూడా బాగున్నాయి. రవి కె.చంద్రన్ కెమెరా పనితనం అధ్బుతంగా ఉంది.యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి.నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.ఆర్ట్ వర్క్,ఎడిటింగ్ అన్ని పక్కాగా ఉన్నాయి.త్రివిక్రమ్ మాటలు తూటల్లాగా పేలాయి.

విశ్లేషణ:

భీమ్లా నాయక్ పక్కా కమర్షియల్ ఫిలిం.అయ్యప్పన్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కినా.. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టు మార్పులు చేసి బాగా తీసారు.ముఖ్యంగా త్రివిక్రమ్ రాసుకున్న డైలాగులు,సీన్లు బాగా కుదిరాయి.సినిమా మొదలైన ఫస్ట్ సీన్ నుండే త్రివిక్రమ్ మార్కు కనిపిస్తుంది. తర్వాత వరుసగా అన్ని సీన్లు బాగా పండాయి. పవన్-రానా ల మధ్య సీన్లు,రావు రమేష్ కామెడీ,పాటలు అన్నీ బాగున్నాయి. ఇక సెకండాఫ్ లో కూడా సేమ్ పేస్ మెయింటేన్ చేశాడు డైరెక్టర్ సాగర్ చంద్ర.ఇద్దరు స్టార్లను హ్యండిల్ చేయడం కష్టమే కానీ..డైరెక్టర్ సాగర్ చంద్ర పర్ఫెక్ట్ గా తీసాడు.సెకండాలో క్లైమాక్స్ ముందు కాస్త దారి తప్పినట్టయింది.కానీ మళ్లీ క్లైమాక్స్ లో థర్డ్ యాక్ట్ పర్ఫెక్ట్ గా కుదరడం వల్ల పర్ఫెక్ట్ ప్యాకేజీ అయింది. ఓవరాల్ గా అయ్యప్పన్ కోషియమ్ చూడని వాళ్లకు ‘‘భీమ్లా నాయక్ బాగా నచ్చుతుంది.చూసిన వాళ్లు కూడ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. పవన్ – రానా ల సీన్లు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,మాటలు,మార్పులు మెయిన్ హైలెట్.

బాటమ్ లైన్: పవర్ ఫుల్ నాయక్