బ్రో.. టీజర్ అద్దిరిపోయింది.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేశారు

బ్రో.. టీజర్ అద్దిరిపోయింది.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేశారు

ఏంటీ ఇంత చీకటిగా ఉంది.. పవర్ లేదా అంటే చాలు.. పవర్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్.. హలో మాస్టారు అంటే రాదు.. గురువుగారూ.. హలో తమ్ముడూ.. బ్రో అనగానే చాలు.. పవర్ స్టార్ అలా పవర్ ఇచ్చేస్తారు.. బ్రో మూవీ టీజర్ అయితే అద్దిరిపోయింది.. కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం లాంటి డైలాగ్స్ తో పవన్ కిక్కు ఇచ్చేశారు.. సినిమాలు ఎక్కువ చూస్తావా ఏంట్రా నువ్వు అంటూ వెటకారపు మాటలతో.. తన మేనరిజంతో ఫ్యాన్స్ మైమరిపించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్ – సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ గా.. ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ కామెంట్స్ ఆధారంగా టీజర్ ఉంది. సినిమా చూస్తుంటే మంచి ఎంటర్ టైన్ మెంట్ గా కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ డ్రస్సింగ్ స్టయిల్ మరో లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. 

పవన్ కల్యాణ్ చిరునవ్వులు.. ఈజీ యాక్టింగ్ మరోసారి అద్భుతహా అన్నట్లుగా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా మాంచి కామెడీగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. డాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ తో అదరగొట్టటం ఖాయంగా కనిపిస్తుంది బ్రో సినిమా.

ప్రపంచవ్యాప్తంగా జులై 28న బ్రో మూవీ (BRO) రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. థమన్  సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇంకా ఎందుకు ఆలస్యం బ్రో.. కింద టీజర్ ఉంది.. చూసి మీరూ ఎంజాయ్ చేసేయండీ..