
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాత్రి (జులై21న) ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘నేను క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చాకనే రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొవాల్సి వచ్చింది. కానీ, సినిమాల్లో మాత్రం ఫైట్లు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్నా మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ వీరమల్లు కోసం తిరిగి ప్రాక్టీస్ చేశా. ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు డైరెక్షన్ చేశా’’అని ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలిపారు.
అలాగే, హరిహర వీరమల్లు కథ గొప్పతనం గురించి పవన్ మాట్లాడారు. ‘‘మన భారతదేశం ఆనాటి నుంచి నేటివరకు ఎవరిపై దాడి చేయలేదు. మనపైనే ప్రతిఒక్కరూ దాడి చేశారు. అక్బర్, షాజహాన్..ఇలా మొగల్ రాజులు గొప్ప అంటూ పుస్తకాల్లో చెప్పారు. కానీ మన విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి ఎక్కడ ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పట్లో ఛత్రపతి శివాజీ ధైర్యంగా పోరాడారు. అలా ధర్మం కోసం పోరాడిన ఒక కల్పిత పాత్రనే ‘హరిహర వీరమల్లు’. ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.
ఇందుకోసం క్రిష్ చాలా రీసెర్చ్ చేశారు. ఆయన ఈ సినిమాకు పునాది. క్రిష్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది.ఈ సినిమా కోసం క్రిష్ పెట్టిన ఎఫర్ట్స్ చూసే..నాలో ఎనర్జీ రెట్టింపు అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం చేతులు మారుతూ చివరికి లండన్ మ్యూజియానికి చేరుకుంది.
ఈ సినిమా ఎన్ని కోట్లు సాధిస్తుందో చెప్పలేను. మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. ఈ గుండె మీకోసమే కొట్టుకుంటుంది. మీ కష్టాలను తీర్చడానికి కొట్టుకుంటుంది’’అని పవన్ తెలిపారు.