
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా సామాజిక, మహిళా భద్రత, మూగజీవాల విషయాలపై ఆమె వెంటనే రియాక్ట్ అవుతుంది. అలాగే దేశ భద్రతకి సంబంధించిన అంశాలపై కూడా అప్పుడప్పుడూ తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటుంది.
ఇక లేటెస్ట్గా రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇలా చేయాలంటూ ఓ సలహాచ్చింది. మన దేశం, మన కుటుంబ భద్రత గురించి మీరు నిజంగా శ్రద్ధ వహిస్తే.. చైనాలో తయారైన చిన్న వస్తువులను కొనడం మానేయాలని సూచించింది.
'నేను కూడా ఇప్పటివరకూ చైనాలో తయారైన చాలా వస్తువుల్ని కొన్నాను. కానీ ఇక నుంచి ప్రతి లేబుల్ని చెక్ చేసి చైనాలో తయారైంది అయితే కొనడం మానేయడానికి ట్రై చేస్తున్నా. ఇక ముందు కూడా. అలానే చేస్తాను. ఇది చాలా పెద్ద పనే.. కానీ ఎక్కడో ఒకచోట మొదలు కావాలి. సో మీరు కొనే ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందనే లేబుల్ని కచ్చితంగా చదవండి.
మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు.. ఈ పోస్ట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అందరూ చర్చించండి. ఆ పిచ్చి పిచ్చి రియాలిటీ టీవీ షోలు చూడటం మానేసి మన దేశం గురించి మాట్లాడుకోవడం మొదలుపెడదాం. జై హింద్' అంటూ ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.