Hari Hara Veera Mallu: తెలంగాణలో ‘HHVM’ పెయిడ్ ప్రీమియర్ షో.. ట్యాక్స్తో కలిపి టికెట్ కాస్ట్ ఎంతంటే?

Hari Hara Veera Mallu: తెలంగాణలో ‘HHVM’ పెయిడ్ ప్రీమియర్ షో.. ట్యాక్స్తో కలిపి టికెట్ కాస్ట్ ఎంతంటే?

‘హరిహర వీరమల్లు’ మూవీకి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. సోమవారం (జులై 21న) తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసి టికెట్ల ధరలు వెల్లడించింది. అంతేకాదు బుధవారం (జులై 23న) రాత్రి 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇచ్చింది. ఈ షోకి టికెట్ల ధరను రూ.600గా నిర్ణయించింది. దీన్నీ మొత్తం టికెట్ ధర: రూ. 600 + GST కలుపుకుని రూ.708గా ఉంది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్కు అనుమతించి, టిక్కెట్ ధరలను పెంచడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక రకంగా ఇదొక షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే, గత సంవత్సరం పుష్ప 2 తొక్కిసలాట తర్వాత, ప్రభుత్వం ఇకపై ప్రత్యేక షోలు లేదా టిక్కెట్ల పెంపుదల అనుమతించబడదని చెప్పింది. ఇక ఇప్పుడు ధరలను పెంచడమే కాకుండా పెయిడ్ ప్రీమియర్స్కు అనుమతివ్వడం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు గమనిస్తే.. 

తెలంగాణ వీరమల్లు టికెట్ ధరలు:

సినిమా విడుదలైన జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ ఒకే చెప్పింది. సింగిల్ స్ర్కీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‎ల్లో వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‎లో టికెట్ ధర గరిష్టంగా రూ.150.. మల్టీప్లెక్స్‎ల్లో హయ్యెస్ట్ రూ. 200 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది.

జూలై 24 నుంచి 27 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్‎ల్లో రూ.200 ధర పెంచి టికెట్లు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.106, మల్టీప్లెక్స్‎ల్లో రూ.150 టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ రేట్లకు జీఎస్‎టీ అదనమని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఏపీ వీరమల్లు టికెట్ ధరలు:

ఏపీ ప్రభుత్వం కూడా హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యే ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు డిసైడ్ చేసింది సినిమా యూనిట్. ప్రీమియర్ షోలకు గాను ఒక్కో టికెట్ రూ. 600గా డిసైడ్ చేసింది సినిమా యూనిట్. దీనిపై జీఎస్టీ అదనం అని స్పష్టం చేసింది.

►ALSO READ | Mohanlal: మోహన్ లాల్ ఖాతాలో మరో హిట్ రాస్కోండి.. 

అంతే కాకుండా సినిమా రిలీజైన రోజు నుండి పదిరోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు 10 రోజుల దాకా అన్ని థియేటర్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని తెలిపింది ప్రభుత్వం.

లోయర్ క్లాస్ టికెట్లు రూ.100, అప్పర్ క్లాస్ టికెట్లు రూ.150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్లు రూ. 200 వరకు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ గరిష్ట టికెట్ ధర 230 నుంచి మల్టిప్లెక్స్‏కి 295 వరకు ఉండే అవకాశం ఉంది. 

దాదాపు రూ.250కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌  ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ నవాబుల దగ్గరికి ఎలా చేరింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.