Mohanlal: మోహన్ లాల్ ఖాతాలో మరో హిట్ రాస్కోండి.. పాజిటివ్ రివ్యూస్తో కొత్త మూవీ టీజర్

Mohanlal: మోహన్ లాల్ ఖాతాలో మరో హిట్ రాస్కోండి.. పాజిటివ్ రివ్యూస్తో కొత్త మూవీ టీజర్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే లూసిఫర్ 2, తుడురమ్ సినిమాలతో వచ్చి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో మరో వినూత్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకోస్తున్నారు. 

సత్యన్ అంతికద్ డైరెక్షన్లో మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హృదయపూర్వం (Hridayapoorvam).ఈ సినిమాలో రాజసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్, ప్రేమలు ఫేమ్' సంగీత్ ప్రతాప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ లాల్ సొంత నిర్మాణసంస్థ ఆషిర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోని పెరుంబవూర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవలే రిలీజైన హృదయపూర్వం టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ 65 సెకన్ల టీజర్.. సరదాగా ఉండే చిన్న ప్రపంచంలోకి తీసుకెళ్లిందని సినీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు చాలా కాలంగా మిస్ అవుతున్న మోహన్ లాల్ యొక్క చాలా ప్రియమైన హాస్యాన్ని ఇపుడీ మూవీతో చూడబోతున్నాం అంటున్నారు. ఈ టీజర్లో సినిమా కథాంశం గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ ఆడియన్స్ కు ఏం ఇవ్వాలో అది పర్ఫెక్ట్గా సెట్ చేశాడంటూ మోహన్ లాల్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మోహన్ లాల్ ఓ కాలేజీలో ఫ్రెష్ లుక్తో టీజర్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో మోహన్ లాల్ ఎక్కడినుంచి వచ్చావని అడగ్గా.. కేరళ నుంచి వచ్చానని అవతల వ్యక్తికి చెబుతాడు. అక్కడతను వెంటనే.. కేరళలో నాకు ఫాఫా చాలా ఇష్టం. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ బాగుంటుందని తనదైన క్యూట్ ఎక్స్ప్రెషన్లో చెబుతాడు. ఆపై మోహన్ లాల్ అతనే కాదు సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారని అంటాడు. కానీ అతను ఫాఫానే నా బెస్ట్ అంటాడు.. అప్పుడు మోహన్ లాల్ చిన్నపాటి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత మాళవిక, సంగీత్ ఎంట్రీ బాగుంది. వీళ్ళిద్దరూ మోహన్ లాల్ తో కామెడీ చేయడం సినిమా క్యూట్ నెస్ ఏంటో చెప్పుకొచ్చింది. ఓవరాల్గా హృదయపూర్వం మూవీ కంప్లీట్ ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వబోతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

►ALSO READ | Avatar Fire & Ash : జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కొత్త విలన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

మరోవైపు మోహన్ లాల్ ఇప్పటికే వృషభ చిత్రాన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ రెండు సినిమాలు రిలీజ్‌‌కు రెడీగా ఉన్నాయి. అలాగే మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, ‘దృశ్యం3’ సెప్టెంబర్‌‌‌‌లో సెట్స్‌‌కు వెళ్లనుంది.