Avatar Fire & Ash : జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కొత్త విలన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Avatar Fire & Ash : జేమ్స్ కామెరూన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కొత్త విలన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

జేమ్స్ కామెరూన్ ( James Cameron ) తెరకెక్కించిన 'అవతార్' ప్రపంచం మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ' అవతార్ : ఫైర్ అండ్ యాష్' ( Avatar Fire & Ash )  చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీని ఇంగ్లీష్  తోపాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచానాలు భారీగా ఉన్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్ లో వరంగ్ అనే సరికొత్త విలన్ ను పరిచయం చేశారు. ఈ పాత్రలో నటి ఊనా చాప్లిన్ ( Oona Chaplin ) కనిపించనుంది. ఆమె పాత్ర ఈ మూవీకి కొత్త డైనమిక్స్ తీసుకొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

అవతార్ సీక్వెల్ 3లో  భాగంగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉండబోతుంది.  ప్రేక్షకులను  ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి తిరిగి తీసుకెళ్తుందని చిత్ర బృందం తెలిపింది. 20th సెంచరీ స్టూడియోస్ నిర్మించిన ఈ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ ( 2022 ) కి సీక్వెల్, అవతార్ ఫిల్మ్ సిరీస్ లో వస్తున్న మూడవ భాగం ఇది.  జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతమైన విజువల్స్ అందరిని ఆశ్చర్యపరుస్తాయని మూవీ టీం తెలిపింది.  పండోరాలోని అదర్భుతమైన జీవరాశులు, లోతైన సముద్రాలు, విశాలమైన అడవులు.. ప్రేక్షకులను కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తాయి. అద్భుతమైన అత్యాధునిక గ్రాఫిక్స్ తో కనుల ముందు సాక్షాత్కరించనున్నాయి.  

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ప్రపంచం మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ' అవతార్ : ఫైర్ అండ్ యాష్' చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఇంగ్లీష్ తోపాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భాషల్లో విడుదల కానుంది.

►ALSO READ | Kannappa: OTTలో 'కన్నప్ప' రిలీజ్.. నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి!

'అవతార్: ఫైర్ అండ్ యాష్' షూటింగ్ 2017 సెప్టెంబర్ 25న న్యూజిలాండ్‌లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'తో పాటు ఏకకాలంలో మొదలైంది. మూడు సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ భారీ షూటింగ్ 2020 డిసెంబర్ చివరిలో పూర్తయింది. ఈ చిత్రం విడుదల తేదీ తొమ్మిదిసార్లు వాయిదా పడింది.. చివరిసారిగా 2024 ఆగస్టు 9న వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు 2025 డిసెంబర్ 19న విడుదల కావడానికి సిద్ధమైంది. సినిమా నిర్మాణానికి తీసుకున్న సమయం, ప్రతి సన్నివేశంలోనూ కనిపించే పర్ఫెక్షన్, కామెరూన్ యొక్క విజన్‌కు నిదర్శనమని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌లో 'అవతార్ 4' 'అవతార్ 5' సీక్వెల్స్ కూడా నిర్మాణ దశలలో ఉన్నాయి, ఇవి వరుసగా 2029 , 2031లో విడుదల కానున్నాయి.

గత 'అవతార్' చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సాంకేతికంగా, కథాపరంగా సరికొత్త ఒరవడిని సృష్టించిన ఈ సిరీస్, 'అవతార్: ఫైర్ అండ్ యాష్'తో కూడా అదే స్థాయిలో అద్భుతాలు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  జేమ్స్ కామెరూన్ యొక్క దూరదృష్టి, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్,  పండోరా  ప్రపంచం ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేస్తాయని భావిస్తున్నారు.

శాం వర్తింగ్‌టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్ వంటి స్టార్ నటులు తిరిగి వస్తుండటంతో, ఈ చిత్రం పాత అభిమానులను , కొత్త ప్రేక్షకులను తన విస్తారమైన ప్రపంచంలోకి ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. 20th సెంచరీ స్టూడియోస్ ఇండియా ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న 6 భాషల్లో విడుదల చేయనుంది. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కేవలం ఒక సినిమా కాదు, అది ఒక కల్పన, ఒక అనుభవం. పండోరాలోని అద్భుతమైన అందాలను, నమ్మశక్యం కాని జీవరాశులను , నావీ తెగ యొక్క సాహసాలను వెండితెరపై చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కామెరూన్ యొక్క సృజనాత్మక ప్రతిభకు , సినిమా నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మరో నిదర్శనం కానుంది. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి..