Kannappa: OTTలో 'కన్నప్ప' రిలీజ్.. నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి!

Kannappa: OTTలో 'కన్నప్ప' రిలీజ్..  నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి!

మంచు విష్ణు డ్రీమ్ మూవీ 'కన్నప్ప' భారీ అంచనాలతో జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. అయితే ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  ఈ చిత్రం రిలీజ్ అయిన కొన్ని రోజులకే చతికిలపడింది. ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి ఆగ్ర నటీనటులు నటించారు.  మల్టీస్టారర్ తో పాటు భక్తి కథ కావడంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే 'కన్నప్ప' OTTలో కి వచ్చేందుకు రెడీ అయింది. జూలై 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ తగ్గిపోవడంతో  ఇప్పుడు ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  గతంలో ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. కనీసం పదివారాల పాటు 'కన్నప్ప' ఓటీటీలో విడుదల కాదు. ముందు సినిమా థియేటర్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ఓటీటీ రిలీజ్ ప్రేజర్ లేదని , 10 వారాల విండో ఉంటుందని చెప్పారు . అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆకస్మాత్తుగా డిజిటల్ ఆరంగ్రేటం చేయడం ... వెనుక బాక్సాఫీస్ వైఫల్యమే కారణం కావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఓటీటీలో రిలీజ్ పై 'కన్నప్ప' టీం నుంచి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ALSO READ : Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అప్డేట్..శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ ఫిక్స్

దాదాపు రూ. 200 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.  ఈ 'కన్నప్ప' మూవీపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ మూవీని ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే... భీకర గిరిజన యోధుడైన తిన్నడు అనే వేటగాడి జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. ఇది మొండి నాస్తికుడి నుండి నిజమైన శివ భక్తుడిగా మారిన అతని ప్రయాణంపై దృష్టి పెడుతుంది. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు, కిరాతుడిగా మోహన్ లాల్, రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, నెమలిగా ప్రీతి ముఖుందన్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు, నాతనాథుడుగా ఆర్.శరత్ కుమార్, పన్నాగగా మధూ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముఖేష్ కుమార్ సింగ్ చేయగా నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరించారు. మరి OTTలో ఈ మూవీ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి..