
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. గురువారం (జులై24న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇన్నాళ్లు మూవీ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్.. గత మూడ్రోజులుగా టికెట్ల ఓపెనింగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇపుడీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది.
లేటెస్ట్గా ఇవాళ మంగళవారం (జులై22న) హరిహర వీరమల్లు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జులై 24న ఉదయం 8 గంటలకు మొదటి షో పడనుంది. ఇప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి.
అయితే, ఈ సినిమా టికెట్ బుకింగ్స్..మొదట ‘డిస్ట్రిక్ట్ యాప్’ లో మాత్రమే ఓపెన్ అయ్యాయి. మరో టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ 'బుక్ మై షోలో' ఇవాళ సాయంత్రలోపు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఇకపోతే, పుష్ప 2 సినిమాకు సైతం ముందుగా 'డిస్ట్రిక్ట్ యాప్' లోనే విడుదలవ్వడం గమనార్హం! మరి ఆలస్యం ఎందుకు..‘వీరమల్లు ఖడ్గం పట్టుకుని యుద్దానికి సిద్దమైనప్పుడు.. వీక్షించడానికి ఫ్యాన్స్ టికెట్ల కోతలతో బూస్ట్ ఇవ్వండి’.
ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూలై 23వ తేదీ రాత్రి థియేటర్లలో హరిహర వీరమల్లు బొమ్మ పడనుంది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది మూవీ యూనిట్. ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడమే కాకుండా హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.